* అక్కడికక్కడే చిరుత మృతి
* నార్సింగి మండలం వల్లూరు 44వ జాతీయ రహదారిపై ఘటన
చేగుంట , జనవరి 30 విజయక్రాంతి: రోడ్డు ప్రమాదంలో చిరుత మృతిచెందిన ఘటన గురువారం రాత్రి నార్సింగి మండల పరిధిలోని వల్లూరు వద్ద 44వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఫారెస్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం .. జాతీ య రహదారి పైనుంచి రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో చిరుతపు అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న చేగుంట ఎస్సై చైతన్య కుమార్‌రెడ్డి పులి కళేబరాన్ని అటవీ శాఖ అధికారులు డీఎఫ్‌ఓ జ్యోతి, రేంజ్ ఆఫీసర్ విద్యాసాగర్‌కు అప్పజెప్పినట్లు తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో..
కామారెడ్డి, జనవరి30 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల పరిధి లో లేగదూడపై చిరుత దాడిచేసి చంపేసింది. వివరాలు.. లింగంపల్లి గ్రామానికి చెందిన చౌడం స్వామి లింగంపేట పెద్దవాగు సమీపంలో అటవీ ప్రాంతానికి అనుకొని ఉన్న తన పొలం వద్ద ఎప్పటిలాగే బుధవారం సాయంత్రం పశువులను షెడ్డులో కట్టేసి ఇంటికి వెళ్లాడు.
గురువారం తెల్లవారుజామున పొలం వద్ద ఉన్న కొట్టంలో చూడగా లేగదూడ చనిపోయి ఉంది. అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ వినోద్, బీట్ ఆఫీసర్లు లింగయ్య, చంద్రశేఖర్, పశువైద్యాధికారులు లేగదూడకు పంచనామ నిర్వహించారు. చిరుత దాడిలోనే దూడ మృతిచెందినట్లు వారు ధృవీకరించారు.