calender_icon.png 16 November, 2024 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండుగ సీజన్లోవాహన విక్రయాలు

16-11-2024 02:52:18 AM

12 శాతం వృద్ధి

న్యూఢిల్లీ, నవంబర్ 15: ఈ పండు గ సీజన్లో ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాలు నిరుడుతో పోలిస్తే 12 శాతం వృద్ధిచెంది 42,88,248 యూనిట్లకు పెరిగినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్స్ డీలర్స్ అసోసియేన్స్ (ఫెడా) తెలిపింది. గత ఏడాది పండుగ సీజన్లో 38,37,040 యూనిట్లు విక్రయమయ్యాయి. పాసింజర్ వాహన అమ్మకాలు 7 శాతం పెరిగి 6,03,009 యూనిట్లకు చేరాయని ఫెడా ప్రెసిడెంట్ సీఎస్ విఘ్నేశ్వర్ శుక్రవారం చెప్పారు. టూ వీలర్స్ అమ్మకాలు 14 శాతం వృద్ధితో 29,10,141 యూనిట్లకు పెరిగాయి. గ్రామీణ డిమాండ్‌తో ద్విచక్ర వాహన విక్రయాలు పెరిగాయని విఘ్నేశ్వర్ తెలిపారు. వాణిజ్య వాహన అమ్మకా లు 1 శాతం పెరుగుదలతో 1,28,738 యూనిట్లకు పెరగ్గా, ట్రాక్టర్ల విక్రయా లు మాత్రం 2% క్షీణించి 85,216 యూనిట్లుగా నమోదయ్యాయి.