21-03-2025 11:42:35 PM
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గ్రామ పంచాయతీకి సంబంధించిన వాహనాల పార్కింగ్ ఫీజు, గోదావరి రేవు పాట, కొత్త మార్కెట్ మంగళవారం సంత, చర్చి రోడ్ షాపులు, పిల్లల పార్క్ షాపుల కోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికి శుక్రవారం బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలంలో వాహనాల పార్కింగ్ ఆశీలు గతంలో ఎన్నడూ లేని విధంగా 1 కోటి 20 లక్షల రూపాయలకు చేరుకున్నాయి, దీంతో ఇది భద్రాచలంలో చర్చనీయాంశంగా మారింది. గతేడాది ఈ ఆశీలు 98 లక్షల రూపాయలకు మాత్రమే వెళ్లగా, ఈసారి భద్రాచలం చెందిన భూక్యా రంగా అత్యధిక ధరకు దక్కించుకున్నారు.
ఇతర ఆశీలు కూడా గణనీయమైన ధరలకు అమ్ముడయ్యాయి:
కొత్త మార్కెట్ మంగళవారం సంత ఆశీలు రూ.3,80,000 (భూక్య రంజిత్) రూపాయలు,
ఫెర్రీ వేలం (గోదావరి రేవు పాట కోర్స చినబాబు దొర) రూ.27,25,000 వేలంపాటలు దక్కించుకున్నారు. అలాగే ఖురాన్ పంచాయతీకి చెందిన షాపులు వేలం కూడా జరిగింది.
చర్చి రోడ్ షాప్ 1 ను రూ.1,45,200 (కుప్ప గిరిబాబు)లకు,
చర్చి రోడ్ షాప్ 2 రూ.1,32,000 (కుప్ప గిరిబాబు)లకు,
పిల్లల పార్క్ షాప్ 1 రూ.90,200 (రాజనేని మధు)లకు దక్కించుకున్నారు.
ఈ వేలం పాటకు వ్యాపారవేత్తలు, స్థానిక పెద్దలు, డి ఎల్ పి ఓ సుధీర్ కుమార్, గ్రామ పంచాయతి ఈవో శ్రీనివాస్, టౌన్ ఎస్ఐ విజయలక్ష్మి ఇతర అధికారులు హాజరయ్యారు. గతంలో కంటే ఎక్కువ ఆదాయం రావడం పంచాయతీకి అభివృద్ధికి కలిసొచ్చే అంశమని అధికారులు అభిప్రాయపడ్డారు.