13-03-2025 10:05:00 PM
హుజరాబాద్ సిఐ తిరుమల్ గౌడ్
హుజరాబాద్,(విజయక్రాంతి): హోలీ పండుగ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘిస్తూ శాంతి భద్రతలకు విగాథం కలిగిస్తే చర్యలు తప్పవని హుజురాబాద్ టౌన్ సిఐ తిరుమల్ గౌడ్(Huzurabad Town CI Thirumal Goud) హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలో హోలీ పండుగని పురస్కరించుకుని గురువారం వాహన తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హోలీని సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని సూచించారు. మద్యం సేవించి రోడ్లపై హంగామా సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. హోలీ పూర్తి అయిన అనంతరం కాలువలోకి బావుల ,లోతుగా ఉన్న కెనాల వద్దకి వెళ్లకూడదని సూచించారు. పోలీస్ యంత్రాంగం హోలీకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.