21-03-2025 10:20:38 PM
బూర్గంపాడు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ సతీష్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. వాహనదారులు సరైన ధ్రువీకరణ పత్రాలు ఉండేలా చూసుకోవాలని, ద్విచక్ర వాహనాలపై త్రిబుల్ రైడింగ్ చేయవద్దని, మైనర్లకు తల్లి తండ్రులు వాహనాలు ఇవ్వద్దని, పరిమితికి మించిన వేగంతో వెళ్లవద్దని సూచించారు. సీఐ వెంటా బూర్గంపాడు ఎస్సై రాజేష్, కానిస్టేబుల్ సురేష్ తదితరులు ఉన్నారు.