06-03-2025 09:36:55 AM
హైదరాబాద్: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం(Chennaraopet Mandal) కోనాపురం శివారులో గురువారం ప్రమాదం సంభవిచింది. మిర్చి కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో 20 మంది కూలీలకు గాయాలు కాగా, ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. జీడిగట్టుతండా నుంచి ఇటుకలపల్లి వెళ్తుండుగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ఆటోలు మొత్తం 35 మంది మిర్చి కూలీలు ఉన్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.