26-03-2025 01:54:36 AM
మహబూబాబాద్. మార్చి 25: (విజయ క్రాంతి) మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రం ఎక్సైజ్ స్టేషన్ లో వివిధ కేసులలో సీజ్ చేయబడిన వాహనాలకు మహబూబాబాద్ జిల్లా ఎక్సైజ్ అధికారి కిరణ్ సమక్షంలో బహిరంగ వేలం వెయ్యబడుతుందని అధికారులు తెలిపారు.
ఈ వాహనాల వేలంలో వివిధ కేసులలో అనగా నల్లబెల్లం నాటు సారాయి రవాణా కేసులో పట్టుబడినటువంటి ఒక ఆటో 15 ద్విచక్ర వాహనాలు ఉన్నాయని వేలంలో పాల్గొనేవారు స్వతహాగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ గూడూరులో ఉంచబడినటువంటి వాహనాలను చూసి బహిరంగ వేలంలో పాల్గొనాలని ద్విచక్ర వాహనాలకు వేలంలో పాల్గొనేవారు 20000 ఈఎండిగా కట్టి ఒక్కొక్క వాహనానికి విడివిడిగా గురువారం ఉదయం 10 గంటలకు చెల్లించి వేలంలో పాల్గొనాలని ఎక్సైజ్ సీఐ తెలిపారు.