calender_icon.png 9 January, 2025 | 5:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యేకు గోడు చెప్పుకున్న కూరగాయల వ్యాపారులు

18-09-2024 01:45:11 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లిలో గోదావరి జలాల సరఫరా పథకాన్ని బుధవారం ప్రారంభించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే వినోద్ క్యాంప్ ఆఫీస్ కు బయలుదేరుతుండగా కూరగాయల వ్యాపారులు ఎమ్మెల్యే వాహనానికి అడ్డు నిలిచారు. తమ దుకాణాలను తమకే కేటాయిస్తామని చెప్పి మార్కెట్ యార్డ్ నిర్మించిన తర్వాత వాటికి అడ్వాన్సు కిరాయిలు అంటూ తమను మోసం చేశారని ఎమ్మెల్యే వినోద్ ఎదుట గోడు వెళ్ళబోతున్నారు. తమ దుకాణాలు తమకు ఉచితంగా కేటాయించాలని వారు వేడుకున్నారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే చెప్పడంతో వ్యాపారులు శాంతించారు.