calender_icon.png 3 March, 2025 | 2:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూరగాయల సాగు.. లాభాలు బాగు

03-03-2025 12:51:03 AM

  1. కూరగాయల సాగులో భాగంగా దోస , సొరకాయ పాదులు ఏర్పాటు 
  2. ఆసక్తి చూపుతున్న ముగ్గు వెంకటాపురం మండల రైతులు

కల్లూరు మార్చి 2(విజయక్రాంతి): కూరగాయలు సాగు ద్వారా మంచి లాభాలు సమకూరుతుండడంతో కల్లూరు మండల రైతులు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. మండలంలోని ముగ్గు వెంకటా పురం గ్రామ పంచాయితీ కి చెందిన నడికొ ప్పు నరసింహారావు ఇంటర్ వరకు చదువుకుని వ్యవసాయం మీద మక్కువ తో ఉన్నత చదువులకి స్వస్తి పలికి తనకున్న 2.20గుంటల వ్యవసాయం భూమి లో ఎన్నో రకాల కూరగాయలు పండిస్తూ పలువురు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

వ్యవసాయ రైతులు కూరగాయల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. లాభాలు ఆశాజనకంగా ఉండడంతో దీనిపై శ్రద్ధ చూపుతున్నారు. 20 గుంటల లో టమాటా,20గుంటలలో దోస, 20గుంటల లో బుడమ దోస, 20గుంటలు లో సొర కాయలు, 20గుంటలలో ఆకుకూరలు సాగు చేస్తున్నారు.

 ఏపీ లో అమ్మకాలు 

డ్రిప్ పరికరాలు సబ్సిడీ పద్దతిలో తీసుకోని పొలంలో బిగించు కొని మల్చింగ్ సీట్ వేసి సేంద్రియ పద్దతిలో కూరగాయలు సాగు చేస్తున్నట్టు రైతు తెలిపారు. ఉదయాన్నే కూరగాయలు కోయించి తానే స్వయంగా సరిహద్దు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మార్కెట్ తీసుకోని వెళ్ల మార్కెట్ లకి సప్లై చేస్తామని తెలిపారు. లాభాలు ఆశాజనకంగా ఉండడంతో దీనిపై శ్రద్ధ చూపుతున్నారు. ఎక్కువ మంది రైతులు సొరకాయ, బెండకాయ ల సాగుకి ప్రాధాన్యం ఇస్తున్నారు.

కూరగాయల సాగుపై ఆసక్తి 

మండల వ్యాప్తంగా కూరగాయల సాగు జరుగుతున్నప్పటికీ ప్రత్యేకంగా ముగ్గు వెంకటపురం , పేరువంచ, మండలం లో కొన్ని పంచాయతీల్లో ఎక్కువ మంది రైతులు ఈ సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందులో భాగంగా ఎకరాకు దుక్కి, పందిర్లు, విత్తుకోవడానికి రూ.10 వేలు నుంచి రూ.15 వేలు వరకు ఖర్చు చేసి ఇప్పటికే విత్తనాలు వేశారు.

పలు చోట్ల దోస పాదులు, సొరకాయ, బుడంకాయ కోసం పందిర్లు వేశారు. ఎకరానికి100గ్రాముల ప్యాకెట్ లు పది విత్తనాలు పాకెట్పడతాయి. ఇందులో అంతర్ పంటగా స్థానికంగా దొరికే బుడమ దోసకాయ, దోసకాయ విత్తనాలు  కొనుగోలు విత్తు కోవాలి. బీర, సొరకాయ, దోస టమాటా పంటలు దిగుబడి వచ్చే వరకు ఆకుకూరలు అందుబాటులో ఉండే విధంగా నోటుకోవాలి.

విడతల వారీగా పంటలు చేతికి వచ్చేలా సాగు చేస్తున్నారు. సుమారు రెండు నెలల పాటు టమాటా, సొరకాయ, దోసకాయ, బుడం దోస మార్కెట్కు తరలించి విక్రయిస్తారు. అనంతరం ఇందులో అంతర్ పంటగా వేసిన ఆగాకర అంది వస్తుంది.ఇలా ఐదు రకాల పంటలు ఒకే చోట సాగు చేయడం వల్ల ఎకరానికి పురుగు మందులు, ఎరువులు, తదితర పెట్టుబడులకు  ఖర్చు ఆదిగమి యించవచ్చుని రైతు తెలిపారు.

 బీరకాయ సాగు బాగుంది 

బీరకాయ సాగు ఆదాయంతో పెట్టుబడి ఖర్చులు పోతాయని, అనంతరం టమాటా, బుడంకాయ, దోసకాయ ఆకుకూరల ఫలసాయం ద్వారా సుమారుగా ఎకరాకు రూ.40 వేలు నుంచి రూ.50 వేల వరకు ఆదాయం వస్తుందని, ఇది లాభంగా మిగులుతుందని రైతు నడికోప్పు నరసింహారావు అంటున్నారు.