calender_icon.png 28 October, 2024 | 5:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెజ్, నాన్ వెజ్ : షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

28-10-2024 04:00:49 PM

గజ్వేల్(విజయక్రాంతి): గజ్వేల్ పట్టణంలోని వెజ్, నాన్ వెజ్ సమీకృత మార్కెట్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. సోమవారం గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశ మందిరంలో ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి అధ్యక్షతన నూతన పాలకవర్గం మొదటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమీకృత  మార్కెట్ చుట్టూ షాపింగ్ కాంప్లెక్స్ లను నిర్మించడానికి ఏకగ్రీవంగా తీర్మానించారు.

రైతులకు నాణ్యమైన సేవలు అందించడానికి  పనిచేస్తుందని ఏఏంసి చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. రైతులను దళారులు మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. త్వరలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుందని, రైతుల తమ పత్తిని సిసిఐ కొనుగోలు కేంద్రాల్లోని అమ్మి గిట్టుబాటు ధరలు పొందాలని ఏఏం సి చైర్మన్ నరేందర్ రెడ్డి ఈ సందర్భంగా సూచించారు.

అన్ని మండలాల్లో దాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, కొనుగోలు కేంద్రంలోని రైతులు ధాన్యం అమ్ముకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం సన్న వడ్లకు రూ. 500 రూపాయలు బోనస్ ఇస్తుందని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. గజ్వేల్ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డిని వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ ను, డైరెక్టర్లను  మున్సిపల్ చైర్మన్ ఎన్ సి రాజమౌళి శాలువలతో ఘనంగా సన్మానించారు. మార్కెట్ కమిటీ కార్యదర్శి జాన్ వెస్లీ, ఏడిఏ బాబు నాయక్, ఏవో నాగరాజు, సూపర్వైజర్ మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.