పటాన్ చెరు: వీర వనిత అహల్య బాయి హోల్కర్ జయంతి ఉత్సవాలను ఆదివారం పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామ ప్రాథమిక పాఠశాలల ఆవరణలో నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అప్పల ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. 300 సంవత్సరాల క్రితమే హిందూ ధర్మం, సనాతన ధర్మం, మహిళల అభ్యున్నతి కోసం పోరాడిన వీర వనిత అహల్య బాయి హోల్కర్ అని అన్నారు. హిందూత్వం గొప్పదనాన్ని, భారతదేశ ఔన్నత్యాన్ని ప్రజలకు తెలియజేశారన్నారు. అలాగే కుటుంబ వ్యవస్థ, గోమాత గురించి సనాతన ధర్మం గురించి భవిష్యత్ తరాలకు మహిళలకు అప్పల ప్రసాద్ వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పటాన్చెరు మండల అధ్యక్షుడు వీరేశం, అమీన్ పూర్ మండల అధ్యక్షుడు ఈర్ల రాజు, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు, బీజేపీ నాయకులు, హిందువులు, మహిళలు పాల్గొన్నారు.