calender_icon.png 3 April, 2025 | 8:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండల కో-ఆర్డినేటర్ గా వీరస్వామి

03-04-2025 12:11:47 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),ఏప్రిల్ 02:(విజయక్రాంతి) :   భారతదేశ రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఏఐసీసీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జై బాపు,జై భీమ్,జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమానికి జాజిరెడ్డిగూడెం మండల కోఆర్డినేటర్ గా మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు,మాజీ సర్పంచ్ జీడి వీరస్వామి బుధవారం నియమితులయ్యారు.

ఈ సందర్భంగా వీరస్వామి మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగాన్ని బిజెపి అనగదొక్కాలని చూస్తుందని,అమిత్ షా అంబేద్కర్ ను పార్లమెంట్ సాక్షిగా అవమానపరిచారని గుర్తు చేశారు.కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వం 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అన్నింటినీ అమలుపరుస్తుందని అన్నారు.తన నియామకానికి సహకరించిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలుకు,డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ కు,కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సామా అభిషేక్ రెడ్డి,ఇందుర్తి వెంకటరెడ్డి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.