calender_icon.png 30 April, 2025 | 8:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్ద కొడప్గల్ లో వీరశైవ బసవేశ్వర జయంతి వేడుకలు

30-04-2025 04:26:43 PM

పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలో బుధవారం వీరశైవ మహాత్మా బసవేశ్వర జయంతి సందర్భంగా పెద్ద కొడప్గల్ వీరశైవ లింగాయత్ అధ్యక్షులు సంతోష్ దేశాయ్ పతాక ఆవిష్కరణగావించారు. సంఘసంస్కర్త, సామాజిక తత్వవేత్త, హైందవ మతాన్ని సంస్కరించిన ప్రముఖులలో ఒకరు బసవేశ్వరుడు సమాజంలో కులవర్ణ, లింగ భేదాలు లేవని అందరూ సమానమేనని చాటి చెప్పారు.

అందుకనే బసవేశ్వరుడిని బసవన్న, విశ్వగురు అని పిలుస్తారు. సమాజంలో కుల వ్యవస్థను, వర్ణబేధాలను, లింగ వివక్షతను, సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయవాది శివుడే సర్వేశ్వరుడు శివుడిని మించిన వాడులేడుఅన్న విశ్వాసంతో శివ తత్వ ప్రచారానికి పూనుకున్నారు అలా లింగాయత్ మతాన్ని బీజాలు వేసి లింగాయత్ ధర్మాన్ని స్థాపించారు. వీరశైవ బసవేశ్వర జయంతి సందర్భంగా పాల్గొన్నవారు వీర శైవ లింగాయత్ కామారెడ్డి జిల్లా కార్యదర్శి మల్లప్ప పటేల్, పెద్ద కొడప్గల్ వీర శైవ లింగాయత్ అధ్యక్షులు సంతోష్ దేశాయ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, లింగాయత్ నాయకులు కాశీనాథ్ దేశాయ్, విజయ్ దేశాయ్, శ్యామప్ప పటేల్, బస్వరాజ్ దేశాయ్, డాక్టర్ ఆనంద్ దేశాయ్, నాగ్ నాథ్ పటేల్, హన్మండ్లు దేశాయ్, కల్లూరి పండరి, డాక్టర్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.