calender_icon.png 23 January, 2025 | 6:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘వీరాంజనేయులు విహారయాత్ర’ మనసులో నిలిచిపోతుంది

14-08-2024 12:05:00 AM

డాక్టర్ నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. అనురాగ్ పలుట్ల దర్శకత్వం వహించారు. బాపినీడు.బి, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 14 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మంగళవారం చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. డాక్టర్ నరేశ్ వీకే మాట్లాడుతూ.. ఉషాకిరణ్ మూవీస్‌కు శ్రీవారికి ప్రేమ లేఖ ఎంత పెద్ద సినిమానో ఈటీవీ విన్ కి ‘వీరాంజనేయులు విహారయాత్ర’ అంత పెద్ద సినిమా అవుతుందని నమ్మకంగా చెప్తున్నా.

ఇందులో ప్రేక్షకులు ఊహించని కామెడీ, డైలాగ్స్ పంచ్‌లుంటాయి. ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్‌లా ఉంటుందీ సినిమా. మనసులో మిగిలిపోయే సినిమా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. నటుడిగా గొప్ప అనుభూతిని ఇచ్చిన సినిమా ఇది’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో యాక్టర్ రాగ్ మయూర్, హీరోయిన్ ప్రియా వడ్లమాని, దర్శకుడు అనురాగ్ కూడా మాట్లాడి అభిప్రాయాలు పంచుకున్నారు. చిత్ర యూనిట్ సభ్యులంతా ఈవెంట్‌లో పాల్గొన్నారు.