17-03-2025 12:00:00 AM
‘నెలపాడుపు’ సాహిత్య సాంస్కృతిక వేది క ఆధ్వర్యంలో ప్రభుత్వ సిటీ కళాశాల విద్యార్థి చిక్కొండ్ర రవి రచించిన ‘వీరనాగు’ శతకం ఆవిష్కరణ 19న వనపర్తి జిల్లా బుద్ధారంలోని ఆర్‌డీఆర్‌యంయుపి స్కూల్‌లో జరగనుంది. కవి వనపట్ల సుబ్బయ్య అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, విశిష్ట అతిథిగా శాసనమండలి సభ్యుడు, సుప్రసిద్ధ కవి గోరటి వెంక న్న పాల్గొంటారు. మదిరె మల్లమ్మ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. గౌరవ అతిథులుగా డా.శిఖామణి, డా.కోయి కోటేశ్వరరావు, డా. కె.వీర య్య పాల్గొంటారని పై సంస్థ పేర్కొంది.
భారీ శరీరం అంటే ఎదురులేని ధైర్యం అని కాదు
పెద్ద మనిషి అంటే గట్టి మనిషి అని కాదు,
మంచి మనిషి అని కాదు
గుణగణాలు పరిమాణాలకు అతీతం అనేది ధన్యం
సత్యమిదే తెలుసుకో మిత్రమా.
-బుర్రా వెంకటేశం, ఐఏఎస్
అప్పిచ్చువాఁడు, వైద్యుఁడు
నెప్పుడు నెడతెగక పాఱు నేఱును, ద్విజుఁడున్
జొప్పడిన యూర నుండుము,
చొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ!
సుమతీ! అవసరమైనప్పుడు అప్పిచ్చేవాడు, జబ్బు చేయకుండా చూసి, జబ్బు చేసినప్పుడు చికిత్స చేసేవాడు, తాగడానికి నీటినిచ్చే జీవనది, వివాహాది సంస్కారాలు చేయించే బ్రాహ్మణుడు, వీరు లభించే ఊళ్లో నివసించాలి. వీరు లేని ఊళ్లో ప్రవేశించవద్దు.
వ్యాఖ్యాత:- డా. అద్దంకి శ్రీనివాస్