ఎల్బీనగర్, మే 16 : పోతులూరి వీరబ్రహేంద్రస్వామి సామాజిక విప్లవకారుడని వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు రాయబండి పాండురంగాచారి, కవి, సీనియర్ జర్నలిస్ట్ ఇంద్రవెల్లి రమేశ్ పేర్కొన్నారు. కొత్తపేటలోని వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యాలయంలో గురువారం ‘బ్రహ్మంగారి అలోచన‘ మన కర్తవ్యం’ అనే అంశంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 450 ఏండ్ల క్రితమే అప్పటి సామాజిక రుగ్మతలపై గొంతెత్తారన్నారు. మూఢ నమ్మకాలు, అంటరానితనం నిర్మూలనపై ప్రజలను చైతన్యపర్చి, వర్గ వివక్షతపై అనాడే పోరాడారని పేర్కొన్నారు. ఎంతో ముందుచూపుతో కాలజ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించ డాని తెలిపారు.
వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి, సామాజిక ఉద్యమకారుడు జీవన్‌దుర్గే మాట్లాడుతూ.. అంటరానితనం, అంధ విశ్వాసాలకు వ్యతిరేకంగా అనాడే తన రచనలతో ప్రజలను జాగృతం చేశారన్నారు. దొంగస్వాముల దొపిడీని అప్పట్లోనే ఎండక ట్టారని గుర్తుచేశారు. ఈ నెల 17న ట్యాంక్‌బండ్‌పై బ్రహ్మంగారి ఆరాధానోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఉత్సవాలను విజయవం తం చేయాలని పిలుపునిచ్చారు. స మావేశంలో బీఎల్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మారోజు సునీల్‌కుమార్, వర్క ర్స్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్వీ రాములు, నాయకులు అజయ్‌కుమార్, కృష్ణమాచారి, శ్యాంసుందర్, సోమేశ్వర్‌రావు, శ్రీకాంతాచారి, విజయలక్ష్మి, వరలక్ష్మి, రాజేశ్వర్‌రావు, వెంకట్‌రెడ్డి, భాస్కర్, లింగాచారి, వెంకటాచారి, శివతేజబాబు, శ్రీనివాస్, వెంకటయ్య పాల్గొన్నారు.