calender_icon.png 14 February, 2025 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిమాండ్‌ను రద్దు చేయాలని వీరరాఘవరెడ్డి పిటిషన్

14-02-2025 01:30:35 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): చిలుకూరు బాలాజీ ఆలయ పూజారిపై దాడి కేసులో రిమాండ్‌ను రద్దు చేయాలని కోరుతూ ఈ కేసులో నిందితుడైన కే వీరరాఘవరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్  కే సుజన శుక్రవారం విచారణ చేపట్టారు.  పిటిషనర్ తరఫు న్యాయ వాది సుంకర నరేశ్ వాదనలు వినిపిస్తూ కొందరి ప్రోత్సాహంతో చిలుకూరి బాలాజీ ఆలయం పూజా రి రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారన్నా రు. 

సంఘటన జరిగిన 24 గంటల తర్వాత ఫిర్యాదు చేశారని, ఫిర్యాదు చేయడంలో జాప్యా నికి ఎలాంటి కారణాలను పేర్కొనలేదన్నారు. ఆధ్యాత్మి క రం గంలో పిటిషనర్‌కు వస్తున్న పేరు ప్రతిష్టలను ఓర్చుకోలేక కొంద రు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఫిర్యాదులో ఎలాంటి ఆధారాలు లేకపోయినా వాటిని పరిగణనలోకి తీసుకోకుండా రిమాండ్‌కు ఆదేశిస్తూ రాజేంద్రనగర్ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు.  వాదనలను విన్న న్యాయమూర్తి దీనిపై వివరణ ఇవ్వాలని పీపీని ఆదేశిస్తూ తదుపరి విచారణను 14కు వాయిదా వేశారు.