calender_icon.png 25 September, 2024 | 4:03 PM

వీర మల్లు సెట్!

24-09-2024 02:00:58 AM

పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్నప్రతిష్ఠాత్మక చిత్రం ‘హరి హర వీర మల్లు’ పార్ట్-1 క్యాప్షన్ ‘స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. 2025, మార్చి 28న భారీస్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మొదటిసారి చారిత్రాత్మక యోధుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ మంగళవారం విజయవాడలో ప్రారంభమైంది. హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. దిగ్గజ కళా దర్శకుడు తోట తరణి ఆధ్వర్యంలో చిత్ర బందం భారీ సెట్‌ను నిర్మించింది. ఈ భారీ యుద్ధ సన్నివేశాలను 400 మంది ఫైటర్లతో పాటు, భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులతో చిత్రీకరిస్తున్నారు. దిగ్గజ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.