10-04-2025 12:00:00 AM
17వేల మంది పోలీసులతో బందోబస్తు
డీజేలను వినియోగించొద్దు
సమన్వయ సమావేశంలో సీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): వీరహనుమాన్ జయంతి సం దర్భంగా ఈ నెల 12న నగరంలో జరుగబో యే శోభాయాత్రకు 17వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయబోతున్న ట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. అందుకోసం ఏర్పాట్ల విషయమై వివి ధ శాఖల అధికారులు, యాత్ర నిర్వాహకులతో కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజి ఆడిటోరియంలో బుధవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. సీపీ సీవీ ఆనం ద్ మాట్లాడుతూ.. శాంతియుత వాతావరణంలో వీర హనుమాన్ విజయ యాత్ర నిర్వహించాలని కోరారు. ఊరేగింపు సమయంలో ట్రాఫిక్ జామ్ కాకుండా, ట్రాఫిక్ పోలీసులకు నిర్వాహకులు సహకరించాలని కోరారు.
విగ్రహాల ఎత్తులో ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఊరేగింపులో డీజే సిస్టమ్లను ఉపయోగించకుండా ప్రజలు, భక్తులకు సహకరించాలని సూచించారు. పోలీసు శాఖ ముందస్తు అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాల వినియోగించొద్దన్నారు. హైదరాబాదు కమిషనరేట్ పరిధిలో సుమారు 150 శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రలు, సైబరాబాదు, రాచకొండ పరిధిలో 46 విజయ యాత్రలు తీస్తున్నారు ఈ యాత్రలన్నీ అన్ని ప్రధాన యాత్ర లో కలిసి ముందుకు వెళతాయన్నారు. సోషల్ మీడియాలో పుకార్లను నమ్మ వద్దు, రెచ్చగొట్టే పోస్ట్లు, ఫేక్ మెసేజ్లు వాటిని వ్యాప్తి చేయొద్దని సూచించారు. సమావేశంలో అడిషనల్ సిపి ఎల్ ఆండ్ ఓ విక్రమ్ సింగ్ మాన్, జా యింట్ సిపి ట్రాఫిక్ జోయల్ డెవిస్ , వివిధ శాఖల అధికారులు, డీసీపీలు పాల్గొన్నారు.