calender_icon.png 4 April, 2025 | 6:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

12న వీర హనుమాన్ విజయ యాత్ర

04-04-2025 12:45:34 AM

పోస్టర్‌ను ఆవిష్కరించిన బజరంగ్ దళ్, వీహెచ్‌పీ నాయకులు

హైదరాబాద్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 12వ తేదీన నిర్వహించే వీర హనుమాన్ విజయ యాత్ర పోస్టర్‌ణు గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బజరంగ్‌దళ్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గౌలిగూడ హనుమాన్ మందిర్ నుంచి తాడ్‌బండ్ హనుమాన్ మందిర్ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు.

రాజకీయాలు, కులాలకు అతీతంగా హిందూ శక్తి ప్రదర్శన కోసం ప్రతి ఇంటి నుంచి ఒక హిందూ కార్యకర్త తరలిరావాలని పిలుపునిచ్చారు. విడిపోతే పడిపోతామని ‘బటేగాతో కటేగా‘ అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలని చెప్పారు. ‘ ఏక్ హై తో సేఫ్ హై‘ సంఘటితంగా ఉంటేనే ఏదైనా సాధించగలం అనే నినాదాన్ని అనుసరించాలన్నారు.

వక్ఫ్ పేరుతో దేశంలో అల్లర్లు సృష్టించేందుకు కొంతమంది పనిగట్టుకొని ప్రయత్నం చేస్తున్నారని.. అటువంటి సంఘవిద్రోహ శక్తుల విషయంలో హిందూ సమాజం జాగ్రత్తగా ఉండాలని నాయకులు చెప్పారు.    కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహమూర్తి, రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్‌దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు పాల్గొన్నారు.