calender_icon.png 20 April, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు నగరంలో వీర హనుమాన్ శోభాయాత్ర

12-04-2025 12:00:00 AM

పలు చోట్ల ట్రాఫిక్ మళ్లింపు

17వేల మంది పోలీసులతో బందోబస్తు 

ట్రాఫిక్ హెల్ప్ లైన్ నంబర్ 9010203626

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): హనుమాన్ జయంతి సందర్భంగా శని వారం నగరంలోని పలు ప్రాంతాల్లో వీర హనుమాన్ శోభాయాత్రలు జరుగనున్నాయి. ప్రధా నయాత్ర గౌలిగూడలోని రామ్ మందిర్ నుంచి ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. పుత్లీబౌలి క్రాస్‌రోడ్, ఆంధ్ర బ్యాంక్ క్రాస్‌రోడ్, కోఠి డీఎంఅండ్‌హెచ్‌ఎస్, సుల్తాన్‌బాజార్ క్రాస్‌రోడ్, రామ్‌కోటి క్రాస్‌రోడ్, కాచిగూడ క్రాస్‌రోడ్, నారాయణగూడ వైఎంసీఏ, చిక్కడపల్లి క్రాస్‌రోడ్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, అశోక్‌నగర్, గాధఋనగర్, విక్టోరియా హోటల్ వెనుక నుంచి, ప్రగా టూల్స్, కవాడిగూడ, సీజీవో టవర్స్, బన్సీలాల్ పేట్‌రోడ్, బైబిల్‌హౌజ్, సిటీ లైట్ హోటల్, బాట షోరూమ్, ఉజ్జుని మహంకాళి టెంపుల్, ఓల్డ్ రామగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్, పారడైజ్ క్రాస్‌రోడ్ సీటీఓ జంక్షన్, లీ రాయల్ పాలెస్, బ్రూక్ బండ్, ఇంపీరియల్ గార్డెన్, మస్తాన్ ఏఫ్, తాడ్ బండ్ హను మాన్ టెంపుల్ వరకు జరుగుతుంది.

దాదాపు 12 కిలోమీటర్ల పాటు జరిగే ఈ శోభాయాత్ర రాత్రి 8 గంటలకు తాడ్‌బండ్‌కు చేరుకుంటుంది. ఈ యాత్ర జరిగే సందర్భంలో ఈ మార్గంలో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ శోభాయాత్రకు 17వేల మంది పోలీసులతో బం దోబస్తు నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ప్రత్యేకంగా సీసీ కెమెరాల ద్వారా కంట్రోల్ రూం నుంచి ఆయన యాత్రను పర్యవేక్షించనున్నారు. ట్రాఫిక్‌కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్‌కు చెందిన ఫేస్‌బుక్, ట్విటర్‌ల ద్వారా తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు. ట్రాఫిక్ హెల్ప్ లైన్ నంబర్ 9010203626నంబర్‌ను సంప్రదించొచ్చని సూచించారు.