calender_icon.png 23 January, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్చిలో వీర ధీర శూరన్ 2

23-01-2025 01:16:48 AM

హీరో విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘వీర ధీర శూరన్’. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో మేకర్స్ పార్ట్ 2ని రూపొందించారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్  ఎస్‌యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజరాముడు, దుషార విజయన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందించగా.. రియా శిబు ఈ సినిమాను నిర్మించారు. చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయినందున, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గ్లింప్స్, టీజర్, ఫస్ట్ సింగిల్స్‌తో సినిమాపై అంచనాలు మరింతపెరుగుతున్నాయి. ఈ సినిమాను మార్చి 27న విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.