calender_icon.png 27 December, 2024 | 5:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠ్యపుస్తకాల్లో వీర్ బాల్ దివస్

27-12-2024 03:04:12 AM

  1. ఈ విషయంపై ప్రధాని మోదీతో చర్చిస్తా
  2. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): పాఠ్యపుస్తకాల్లో వీర్‌బాల్ దివస్‌ను చేర్చాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంద ని.. ఈ అంశంపై ప్రధాని మోదీతో చర్చిస్తానని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో గురువారం ఏర్పాటు చేసిన వీర్ బాల్ దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

1,500 ఏళ్ల క్రితం భారతీయ త, ధర్మం కోసం పదో సిక్కు గురువు గురు గోవింద్‌సింగ్ కుమారులు బాబా జోరావర్ సింగ్, బాబా ఫతేసింగ్ ప్రాణత్యాగాలకు పాల్పడ్డారని.. ఆ సందర్భంగా డిసెంబర్ 26ను వీర్ బాల్ దివస్‌గా గుర్తించినట్టు మంత్రి తెలిపారు. బీజేపీ, తెలంగాణ ప్రజల తరఫున ఆ వీరపుత్రులకు ఘన నివాళులర్పిస్తున్నామన్నారు.

సిక్కుల పథం, ధర్మానికి అంకితమై తమ ప్రాణాలను అర్పించి చిన్న వయసులోనే అమరులైన వీరులుగా అభివర్ణించారు. ఏటా నవంబర్ 14న బాలల దినోత్సవం మాదిరిగానే.. దేశానికి స్ఫూర్తిదాయకంగా ఉండేలా డిసెంబర్ 26న వీర్ బాల్ దివస్ జరుపుకొనేందుకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు.

అదేవిధంగా సిక్కు సోదరుల డిమాండ్ మేరకు నగరం నుంచి గోల్డెన్ టెంపుల్‌కు చేరుకునేందుకు అమృత్‌సర్‌కు రైలును నడిపించాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో చర్చిస్తామని హామీ ఇచ్చారు. ఈనెల 28న చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవానికి రైల్వే మంత్రి వస్తున్నారని..

ఈ డిమాండ్‌ను ఆయన దృష్టికి తీసుకెళ్తానని కిషన్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డి, బల్‌దేవ్‌సింగ్, బగ్గాసింగ్, గురుదేవ్‌సింగ్, బగేందర్‌సింగ్, హరిసింగ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.