calender_icon.png 13 March, 2025 | 11:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించిన వీణ

13-03-2025 12:00:00 AM

కలెక్టర్‌ను కలిసిన నూతన ఆర్డీవో

కామారెడ్డి, మార్చి 12 (విజయక్రాంతి) ః కామారెడ్డి ఆర్‌డీఓగా వీణ బుధవారం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లి జిల్లా కలెక్టర్ సంగువాన్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాన్ని అందజేశారు. ఇక్కడ ఆర్డీవో గా పని చేసిన శ్రీనివాస్ రెడ్డి రెండు నెలల క్రితం రిటైర్డ్ అయ్యారు.

అప్పటినుంచి ఎల్లారెడ్డి ఆర్డీవో మన్నె ప్రభాకర్ ఇన్చార్జి ఆర్డీవో గా వ్యవహరించారు. పూర్తిస్థాయి ఆర్డీవో గా వీణ బాధ్యతలు చేపట్టారు. డివిజన్ పరిధిలోని  తాసిల్దార్ లు రెవిన్యూ సిబ్బంది కలిసి పుష్ప గుచ్చాన్ని అందించి స్వాగతం పలికారు. అనంతరం తాసిల్దార్లతో ఆర్డిఓ వీణ సమావేశం నిర్వహించారు.