calender_icon.png 13 April, 2025 | 10:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదావరి నదికి హారతి నిర్వహించిన వేద పండితులు

12-04-2025 11:15:10 PM

మహదేవపూర్ (విజయక్రాంతి): దక్షిణ కాశిగా పేరుపొందిన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం వేద పండితుల ఆధ్వర్యంలో గోదావరి నదికి హారతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం వారి ఆధ్వర్యంలో ప్రతి పౌర్ణమికి గోదావరి నదికి హారతి కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమీషనర్, హైదరాబాద్ ఆదేశాల మేరకు ప్రతి నెల పౌర్ణమి రోజున గోదావరి నదీకి హారతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈవో మహేష్ తెలిపారు. శనివారం ప్రధాన అర్చకులు టి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చక స్వాములు దేవాలయం నుండి మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలతో, గోదావరి నది వద్దకు వెల్లి గోదావరి నదికి హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్ అర్చకులు సిబ్బంది, గ్రామస్తులు, భక్తులు, మహిళలు, సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.