ముంబై, ఆగస్టు 6: మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ కన్సాలిడేటెడ్ నికరలాభం ఈ ఏప్రిల్‌జూన్ త్రైమాసికంలో 36.5 శాతం వృద్ధిచెంది రూ. 3,606 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదేకాలంలో కంపెనీ రూ. 2,640 కోట్ల నికరాభాన్ని ఆర్జించింది. కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.34,279 కోట్ల నుంచి రూ. 36,698 కోట్లకు పెరిగింది. తమ అల్యూమినియం, జింక్ డివిజన్లు మంచి పనితీరును ప్రదర్శించాయని, దీంతో ఇబిటా 47 శాతం పెరిగిందని వేదాంత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అరుణ్ మిశ్రా చెప్పారు.
డీమెర్జర్ స్కీమ్‌కు రుణదాతల అనుమతి
తమ వ్యాపారాల డీమెర్జర్ ప్రక్రియ మొదలయ్యిందని, ఇప్పటికే డీమెర్జర్ స్కీమ్‌కు రుణదాతల అనుమతి లభించిందని, ఎన్సీఎల్టీకి స్కీమ్‌ను సమర్పించా మని వేదాంత వెల్లడించింది. వేదాంత స్థూల రుణం రూ. 78,000 కోట్ల మేర ఉన్నది. ఆయిల్ అండ్ గ్యాస్, అల్యూమినియంలతో సహా వివిధ వ్యాపారాల్ని ఆరు స్వతంత్ర లిస్టెడ్ కంపెనీలుగా విభజించాలని గతంలో వేదాంత ప్రతిపాదిం చింది. ఆయిల్, జింక్, వెండి, రాగి, ఇనుప ఖనిజం, ఉక్కు, అల్యూమినియం, వేదాంత వ్యాపారం విస్తరించింది.