25-02-2025 07:18:06 PM
సూపర్వైజర్ స్టడీ అవర్స్ లో వేదగణితం ప్రాక్టీస్ చేయించాలి..
పాల్వంచ (విజయక్రాంతి): మండల పరిధిలోని ఆదర్శ గిరిజన క్రీడా పాఠశాల కిన్నెరసాని నందు భద్రాచలం ఐటిడిఎ పిఓ బి రాహుల్ ఐఎఎస్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏడవ తరగతి విద్యార్థులతో తరగతి గదిలో నల్లబల్లపై వేదగణితం చేపించారు. విద్యార్థులను విడిగా వేద గణితం చేయమని సూచించగా విద్యార్థులు వాటిని బోర్డుపై రాసి చూపించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ఐఏఎస్ సూచనలు సలహాలు ఇచ్చారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులకు వేదగణితం రాత్రివేళ కూడా ప్రాక్టీస్ చేయించాలని సూచించారు. అదేవిధంగా సైన్స్ లాబ్ ను పరిశీలించి ఎక్స్పైరీ డేట్స్ రసాయనాలు ఏవైనా ఉన్నాయని ప్రశ్నించారు. సైన్సు ల్యాబ్ సంబంధించిన మెటీరియల్స్ కావాలంటే తెలపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏటిడిఓ చంద్రమోహన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లొడిగా రామారావు ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.