calender_icon.png 25 January, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూఎస్ ఓపెన్‌లో వెకిక్ శుభారంభం

27-08-2024 12:00:00 AM

న్యూయార్క్: ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్రియెషియా స్టార్ డొనా వెకిక్ శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో వెకిక్ 6-4, 6-4తో బిర్రెల్ (ఆస్ట్రేలియా)పై సునాయాస విజయాన్ని సాధించింది. గంటకు పైగా సాగిన మ్యాచ్‌లో వెకిక్ తన ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మ్యాచ్‌లో వెకిక్ ఒక ఏస్‌తో పాటు 27 విన్నర్లు కొట్టింది. 16 విన్నర్లకు పరిమితమైన బిర్రెల్ 15 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. మరో సింగిల్స్‌లో డారియా కస్తకినా 6-2, 6-4తో జాక్వెలిన్ క్రిస్టీన్ (రొమెనియా)పై విజయం సాధించగా.. 9వ సీడ్ సక్కారి గాయంతో వైదొలగడంతో అన్‌సీడెడ్ వాంగ్‌కు వాకోవర్ లభించింది.

ఇక పురుషుల సింగిల్స్‌లో భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ తొలి రౌండ్‌లో డచ్ ఆటగాడు గ్రీక్స్‌పోర్‌ను ఎదుర్కోనున్నాడు. డబు ల్స్ విభాగంలో భారత ఆటగాడు రోహన్ బోపన్న-మాధ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) ద్వయం బుధవారం తొలి మ్యాచ్ ఆడనుంది. కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేసిన సెర్బియా వీరుడు నొవాక్ జొకోవిచ్ నేడు తొలి రౌండ్‌లో అన్‌సీడెడ్ ఆల్బట్‌ను ఎదుర్కోనుండగా.. మహిళల ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ నేడు తొలి రౌండ్ మ్యాచ్ ఆడనుంది. స్పెయిన్ స్టార్ అల్కారాజ్  తన తొలి మ్యాచ్‌లో లిటూను ఎదుర్కోనున్నాడు.