calender_icon.png 9 January, 2025 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో సీఎంతో వీసీల సమావేశం

07-01-2025 01:47:49 AM

టీజీసీహెచ్‌ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి

హైదరాబాద్, జనవరి 6 (విజయకాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి త్వరలోనే యూనివర్సిటీల వీసీలతో సమావేశం కానున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. వర్సిటీల్లోని సమస్యలపై చర్చిం చనున్నట్టు పేర్కొన్నారు. సోమవారం మాసాబ్ ట్యాంక్‌లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ పురుషోత్తం, ప్రొఫసర్ మహమూద్, కార్యదర్శి శ్రీరామ్ వెంకటేశ్‌తో కలిసి డైరీని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. ఉన్నత విద్య సిలబస్‌లో మార్పులు తీసుకొస్తున్నట్టు తెలిపారు. ఇంజినీరింగ్ స్టూడెంట్లకు పరిశ్రమలతో ఇంటర్న్‌షిప్స్ కల్పించబోతున్న ట్టు, ఇందుకు బుధవారం ఏఐసీటీఈ, ఐఐటీ మద్రాస్‌తో కలిసి, రాష్ట్రంలోని కాలేజీలతో సమావేశం నిర్వహించనున్నట్టు వెల్లడించారు.