- ఏబీవీపీ డిమాండ్.. ఓయూలో నిరాహారదీక్ష
- విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 12 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ యూని వర్సిటీలకు వీసీలను నియమించాలని ఏబీవీపీ విద్యానగర్ విభాగ్ కన్వీనర్ పృథ్వీ, రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అలివేలు రాజు, కమల్‌సురేష్ డిమాండ్ చేశారు. సోమవారం ఏబీవీపీ ఓయూ శాఖ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఎదుట శాంతియుత నిరాహారదీక్ష చేపట్టారు. అక్కడికి చేరుకున్న ఓయూ పోలీసులు దీక్షను భగ్నం చేసి 15మంది విద్యార్థి నాయకులు అరెస్టు చేసి ఓయూ, అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మా ట్లాడుతూ.. యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పెంచిన పీజీ, పీహెచ్‌డీ ట్యూషన్ ఫీజు, పరీక్ష ఫీజులను తగ్గించా లని డిమాండ్ చేశారు. దీక్షలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దృహన్, నాయకులు శివ, చిరంజీవి, రాజశేఖర్, విష్ణు, చైతన్య, నితీష్, సాయి, జయవీర్, విహాన్షి, సంపత్, రాహుల్ కూర్చున్నారు.