calender_icon.png 10 January, 2025 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆన్‌లైన్ బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్న వారికి సజ్జనార్ వార్నింగ్

30-12-2024 12:49:14 PM

హైదరాబాద్: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు(Online Betting Apps) చాలా మంది జీవితాలను నాశనం చేస్తున్నాయని పేర్కొంటూ వాటి ప్రభావంపై టీజీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్ డైరెక్టర్, ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్(VC Sajjanar) ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్స్ లో ఒక పోస్ట్‌లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లరా!! కాసులకి కక్కుర్తి పడి ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్ లను ప్రచారం చేయకండని హెచ్చరించారు.

రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చని.. మీరు సోషల్ మీడియా(Social media)లో వదిలే ఇలాంటి వీడియోల వల్ల అమాయకులు ఆన్ లైన్ బెట్టింగ్ మహామ్మారికి వ్యసనపరులు అవుతున్నారు.. బంగారు జీవితాలను చిద్రం చేసుకుంటున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. మీ స్వలాభంకోసం ప్రజాశ్రేయస్సును విస్మరించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. సమాజ క్షేమం పట్టని మీ పెడధోరణులు క్షమించరానివని పేర్కొన్నారు. కష్టపడకుండానే కాసులు పోగేసుకోవాలన్న ఆలోచన అనర్థదాయకమైనదని యువత గుర్తించాలన్నారు. స్వార్ధ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల(Social media Influencers) మాటలు నమ్మి.. చాపకిందనీరులా సామాజిక సంక్షోభాన్ని సృష్టిస్తున్న ఆన్ లైన్ బెట్టింగ్ మాయలో పడొద్దని, ఇలాంటి సంఘవిద్రోహ శక్తులకు దూరంగా ఉండండని హెచ్చరించారు.