calender_icon.png 25 December, 2024 | 8:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నారుల భవితకు ‘వాత్సల్య’

20-09-2024 12:00:00 AM

ఎన్పీఎస్ వాత్సల్య పథకం ప్రారంభం భారత దేశ పెన్షన్ వ్యవస్థలోనే ఒక కీలక మలుపు. ఈ పథకం చిన్న వయసునుంచే పిల్లలకు ఆర్థిక భద్రతను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది భవిష్యత్తుకోసం ముందుగానే సురక్షిత పెట్టుబడులు చేయడంలో ఒక వినూత్న మార్గం. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ)పర్యవేక్షణలో నడిచే ఈ పథకం ప్రతి తల్లిదండ్రులకు వారి పిల్లల భవిష్యత్తును గణనీయంగా నిర్మించడానికి సులభమైన అవకాశాన్ని అందిస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ వాత్సల్య పథక నిర్ణయం వారికి ఉన్న దూరదృష్టి, ప్రజలపట్ల అంకిత భావాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోంది.

ఏడాదికి కేవలం వెయ్యి రూపాయల తక్కువ పెట్టుబడితో పిల్లల పేరుమీద ఖాతా ప్రారంభించడం అత్యంత ప్రభావవంతమైన, సురక్షిత మార్గం. ప్రభుత్వం ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకు రావడం నిజంగా ప్రశంసయ నిర్ణయం. అన్ని వర్గాల ప్రజలకు సులభంగా చేరుకునేలా ఉండడమే కాకుండా వారి పిల్లల భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి మరింత శక్తివంతమైన మార్గం కూడా అవుతుంది. 18 ఏళ్లు నిండిన తర్వాత రెగ్యులర్  ఎన్‌పిఎస్ ఖాతాగా మారడం దీర్ఘకాలిక భద్రతను కూడా నిర్ధారిస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ప్రజలందరికీ లాభదాయకం అవుతుందని ఆశిద్దాం.

  డాక్టర్ కృష్ణకుమార్ వేపకొమ్మ, హైదరాబాద్