calender_icon.png 10 October, 2024 | 1:21 PM

స్వేరోస్ నెట్వర్క్ సామాజిక రుగ్మతలపై ఉద్యమిస్తుంది

10-10-2024 11:40:40 AM

సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో జరిగే స్వేరోస్ నేషనల్ కన్వెన్షన్ విజయవంతం చేయాలి

సిద్దిపేట జిల్లా కేంద్రంలో వాల్పోస్టర్ విడుదల చేసిన స్వేరోస్ నెట్వర్క్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

సిద్దిపేట: స్వేరోస్ నెట్వర్క్ ప్రారంభించినప్పటి నుంచి అనేక సామాజిక రుగ్మతలపై ఉద్యమాలు చేస్తూ విజయాలు సాధించిందని సమస్త వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో స్వేరోస్ నేషనల్ కన్వెన్షన్ వాల్పోస్టర్ని విడుదల చేసి మాట్లాడారు. స్వేరోస్ నెట్వర్క్ చేసిన ఉద్యమంలో అత్యంత ముఖ్యమైన అంశంగా గుర్తించే బడిమానిన పిల్లల శాతం తగ్గిందన్నారు. మద్యం సిగరెట్ గుట్కా వరకట్నం వంటి సామాజిక బలహీనతలను నిర్మూలించేందుకు స్వేరోస్ నెట్వర్క్ ప్రతినిత్యం ఉద్యమిస్తుందని వెల్లడించారు.

కులాలకు మతాలకు అతీతంగా జ్ఞాన సమాజమే లక్ష్యంగా పోరాటం చేస్తున్న ఏకైక సంస్థ స్వేరోస్ నెట్వర్క్ అని తెలిపారు భారతదేశంతో పాటు ఇతర దేశాలలో కూడా స్వేరోస్ నెట్వర్క్ ఏర్పడి అనేక అంశాలపై చర్చించే విధంగా ఈ సంస్థ కృషి చేస్తుందన్నారు భవిష్యత్తులో వివిధ ఖండాలలో సైతం స్వేరోస్ నెట్వర్క్ బలంగా పనిచేస్తుందని నమ్ముతున్నట్లు వెల్లడించారు. ప్రధానంగా పేదరిక నిర్మూలన ప్రతి మనిషికి ఉన్నత చదువు అనే లక్ష్యంగా స్వేరోస్ పనిచేస్తారని తెలిపారు. నేటి రోజుల్లో గంజాయి మద్యం డ్రగ్స్ వంటివి గ్రామీణ ప్రాంతాలకు చేరి యువతను బానిసలుగా మారుస్తుందని దాని నిర్మూలనకు స్వేరోస్ నెట్వర్క్ ఉద్యమిస్తుందని వెల్లడించారు.

స్వేరోస్ ఉద్యమంలో భాగస్వాములు కావాలంటే మహిళలను గౌరవించాలని మద్యం సిగరెట్ గుట్కా డ్రగ్స్ వంటికి దూరంగా ఉండాలని ఉన్నత విద్య ఉన్నత ఉద్యోగం వ్యాపారం వంటి వాటిలో రాణించాలని ఇలాంటి ప్రత్యేకమైన షరతులతో స్వేరోస్లో సభ్యత్వం అందజేస్తారని తెలిపారు ఈనెల 27 నాడు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో స్వేరోస్ నేషనల్ కన్వెన్షన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వేరోస్వేరోస్ అభిమానులు స్వేరో సంస్థలో పని చేయాలనుకునేవారు ఈ సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమస్త రాష్ట్ర కన్వీనర్ దుర్గయ్య, కో కన్వీనర్ వీరన్న, ప్రధాన కార్యదర్శి ప్రకాష్, ప్రతినిధులు స్వాములు, బొర్రా సురేష్ కుమార్, మెట్ల శంకర్ జిల్లా అధ్యక్షులు ఉప్పలేటి బాబు ప్రధాన కార్యదర్శి చిన్నికృష్ణ ప్రతినిధులు ఎడ్ల ప్రవీణ్ కుమార్ తిరుపతి, మోహన్ విజయ్ సాయిలు స్వామి తదితరులు పాల్గొన్నారు.