calender_icon.png 27 October, 2024 | 4:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేరే వాళ్ల ఉత్తరాలు చదవడం వాసుదేవ్‌కు అలవాటు

27-10-2024 12:00:00 AM

కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న పీరియాడిక్ థ్రిల్లర్ ‘క’. దర్శక ద్వయం సుజీత్, సందీప్‌లు.. విలేజ్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లు. చింతా గోపాలకృష్ణరెడ్డి నిర్మాత. దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 31న తెలుగులో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం శనివారం మీడియాతో ప్రత్యేకంగా సమావేశమైంది.

ఈ సందర్భంగా హీరో కిరణ్ మాట్లాడుతూ.. మా “క’ మూవీని మొదట తెలుగులోనే విడుదల చేస్తున్నాం. వారం తర్వాత కన్నడ, తమిళ, మలయాళంలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. మా మూవీ క్లుమైక్స్ 20 నిమిషాలు హైలైట్ అవుతుంది. ఇదొక థ్రిల్లర్ మూవీ. ఇందులో ఏదైనా ఎలిమెంట్ గతంలో స్క్రీన్ మీద చూశామని ప్రేక్షకులకు అనిపిస్తే నేను సినిమాలు చేయడం ఆపేస్తా.

నేను చేస్తున్న వాసుదేవ్ క్యారెక్టర్‌లో అనేక షేడ్స్ ఉన్నాయి. గ్రే షేడ్స్ కూడా కనిపిస్తాయి. వేరేవాళ్ల ఉత్తరాలు చదివే అలవాటున్న వాసుదేవ్ లైఫ్ ఎ లాంటి టర్న్ తీసుకుంది అనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది” అని తెలిపారు. దర్శకుడు సందీప్ మాట్లాడుతూ ‘కథ కంటే కథను కొత్తగా చెప్పడమే ముఖ్యం. అలా ఈ సినిమాను స్క్రీన్ మీద కొత్తగా ప్రెజెంట్ చేశాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి, కో ప్రొడ్యూసర్ చింతా వినీషారెడ్డి, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.