14-04-2025 01:01:43 AM
మహబూబ్ నగర్ ఏప్రిల్ 13 (విజయ క్రాంతి) : రోజు రోజుకు డాక్యుమెంట్ రైటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. ఇక్కడ నిబంధనలు ఏమి ఉండవు. సదరు వ్యక్తి రిజిస్ట్రేషన్ కు వస్తే చాలు... అందిన కాడికి లా క్కొని రిజిస్ట్రేషన్ చేసి పంపడమే... అన్ని మేమే చేస్తాం... మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు.. వచ్చి సంతకాలు పెట్టి ఫో టోలు దిగితే చాలు... మొత్తం మేము చూసుకుంటాం చాలానా మేమే కడతాం. గింత ఇవ్వండి అంటూ డాక్యుమెంట్ రైటర్లు ద ర్జాగా దండుకుంటున్నారు.
డాక్యుమెంట్ రైటర్లు ఇంత తీసుకున్నారు ? ఇలా నియంత్రణ చేయాలి ? అనే నిబంధనలు కూడా స బ్ రిజిస్టర్ పరిధిలో లేవని దాటిస్తున్నారు. రిజిస్ట్రేషన్ కి వచ్చే వ్యక్తి వారి ఇష్టం వచ్చిన దగ్గర డాక్యుమెంట్ తయారు చేయించుకుని వస్తే మేము రిజిస్ట్రేషన్ చేస్తాం.. అంటూ అధికారులు చెప్పడంతో చేసేదేం లేక.. ప్రత్యేకం గా మాట్లాడుకొని డాక్యుమెంట్ రైటర్లతో రిజిస్ట్రేషన్ల పత్రాలు తయారు చేయించుకుని వినియోగదారులు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. అంతా ఇంత కాదు ఎంత అడిగితే అంత ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. ఈ విధానం మహబూబ్ నగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయ పరిధిలోని కొందరు డాక్యుమెం ట్ రైటర్లు వారి ఇష్టనుసారంగా రిజిస్ట్రేషన్ కు వచ్చిన వారి నుంచి వసూలు చేస్తున్నారని బాధితులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
డాక్యుమెంట్ రైటర్ చెప్పిందే ఫైనల్...
పాలమూరు రిజిస్ట్రేషన్ కార్యాలయ పరిధిలో డాక్యుమెంట్ రైటర్లు చెప్పిందే ఫైనల్. రిజిస్ట్రేషన్ విలువ తగ్గించి చూపెడితే దీనికి మరో ప్రత్యేకమైన రేటు ఉన్నట్లు తెలుస్తుం ది. వీటన్నిటిని నియంత్రించాల్సిన సబ్ రిజిస్టర్ ఆ దిశగా అడుగులు వేయడంలో వెను కంజ వేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యం లో డాక్యుమెంట్ రైటర్లదే పాలమూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో హవా కొనసాగుతుంది. వారు చెప్పింది ఫైనల్ వారు చేసిందే డాక్యుమెంట్ అనే విధంగా ఈ ప్రక్రియ ముందుకు కదులుతుంది.
ఆస్తి విలవను తగ్గించి రిజిస్ట్రేషన్ చేయించిన సంబంధిత సబ్ రిజిస్టర్లు మాత్రం నోరు మెదపడం లేద నే ఆరోపణలు ఉన్నాయి. ఓ పంచాయతీ కార్యదర్శి తను ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని సబ్ రిజిస్టర్ కార్యాలయం తో పాటు కోయిలకొండ పిఎస్ లో కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై సబ్ రిజిస్టర్ ను వివరణ కోరగా పంచాయతీ కార్యద ర్శి ధ్రువీకరణ పత్రం కచ్చితంగా అవసరం లేదని, రిజిస్ట్రేషన్ చేసేందుకు అవకాశం ఉం టుందని చెప్పారు. పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరణ పత్రం అవసరం లేకుండానే రిజిస్ట్రేషన్ చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని సబ్ రిజిస్టర్ మహమ్మద్ హమీద్ తెలిపారు
చెప్పింది చేయిస్తారు...అడిగిన కాడికి ఇవ్వాల్సిందే
పాలమూరులో డాక్యుమెంట్ రైటర్ల కు ఫుల్ డిమాండ్ ఏర్పడుతుంది. కాస్త టైపు చేసేందుకు వచ్చిన నేరుగా డాక్యుమెంట్ రైటర్ చేస్తే.. తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు పోగు చేసుకునే అవకాశాలు ఉంటాయని కొందరు డాక్యుమెంట్ రైటర్లు నమ్ముతున్నారు. వారి అదృష్టం బాగుంది ఏదైనా కొంత ఇబ్బందికరంగా ఉన్న డాక్యుమెంట్ వస్తే వారితో ప్రత్యేకంగా మా ట్లాడుకొని సెటిల్ చేసుకుంటే మంచి లాభాలను అర్జించే అవకాశం ఉంటుందని కొం దరు డాక్యుమెంటరీ అదే పనిగా చేస్తున్నారు.
ఈ క్రమంలోనే గ్రామపంచాయతీలలో చా లామంది వ్యక్తులు వివిధ రుణాలను పొందేందుకుగాను వారి ఇండ్లను మార్టీగేజ్ చేసేందుకు ఆతృత కనబరుస్తున్నారు. దీంతో ధ్రువీకరణ పత్రం పంచాయతీ కార్యదర్శి ఇవ్వకపోయినా డాక్యుమెంట్ రైటర్ అన్ని వారే చూసుకుంటూ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నానే ఆరోపణలు సైతం బలంగా ఉన్నాయి.
ఇలా పాలమూరు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేయ డం లో డాక్యుమెంట్ రైటర్లు హవా కొనసాగుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక డాక్యుమెంట్ కు రూ 500 నుంచి రూ 2000 ఆ పైగా కూడా కొందరు డాక్యుమెంటరీలు వసూలు చేస్తున్నారు. తీసుకున్న డబ్బులలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కూడా ఇవ్వాలని డాక్యు మెంట్ రైటర్లు చెప్ప డం విశేషం. రిజిస్ట్రేషన్ కదా ఖర్చులు ఎక్కువగానే ఉంటాయని రిజిస్ట్రేషన్ కి వచ్చిన వ్యక్తులు కూడా ముట్ట చెబుతున్నారు.
నియంత్రించే అధికారం మాకు లేదు..
డాక్యుమెంట్ రైటర్లు ఇంత తీసుకోవాలి ఒక డాక్యుమెంట్ అనే నియంత్రణ అధికా రం మాకు లేదు. రిజిస్ట్రేషన్ కి వచ్చిన వ్యక్తి ఎవరితో దగ్గరనైనా డాక్యుమెంట్ తయారు చేస్తే వారు ఇష్టంగా సారంగా ఎంతైనా కొం త ఇచ్చి పత్రాలు తయారు చేయించుకోవాలి. ఈ విషయంలో ఉన్నత అధికారులు డాక్యుమెంట్ రైటర్లకు ప్రత్యేకంగా లైసెన్సులు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అత్యధికంగా వసూలు చేస్తే రిజిస్ట్రేషన్ కి వచ్చిన వ్యక్తులు మా దృష్టికి తీసుకువస్తే వారితో ప్రత్యేకంగా మాట్లాడు తాం. రిజిస్ట్రేషన్ కు వచ్చిన వారికి అన్యా యం జరగకుండా చూస్తాం. ప్రతి విషయంలోనూ పారదర్శకంగా ముందుకు సాగుతున్నాం.
మహమ్మద్ హమీద్, సబ్ రిజిస్టర్, మహబూబ్ నగర్