calender_icon.png 24 April, 2025 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ ఫలితాల్లో వాసవీ విద్యార్థుల సత్తా

24-04-2025 12:37:38 AM

ఫలితాల్లో స్టేట్ ర్యాంకులతో ప్రభంజనం 

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 23 : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలలో వాసవి రెసిడెన్షియల్ ఇంటర్ అండ్ ఒకేషనల్ కళాశాల విద్యార్థులు స్టేట్ ర్యాంకులతో ప్రభంజనం సృష్టించి విజయదుందుబి మోగించారని  కళాశాల చైర్మన్ మాదారం రమేష్ గౌడ్ తెలియజేశారు.

కళాశాలలో విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఫలితాల వివరాలను వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో వాసవి రెసిడెన్షియల్ ఇంటర్ అండ్ ఒకేషనల్ కళాశాల విద్యార్థులు స్టేట్ ర్యాంకులను సాధించారు. వరంగల్ కు చెందిన తేజస్విని ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో 470 మార్కులకు 467 మార్కులతో స్టేట్ 3వ ర్యాంక్, చారగొండ కు చెందిన వరలక్ష్మి ఎంపీసీ గ్రూప్ 470 మార్కులకు 464 మార్కులతో స్టేట్ 5వ ర్యాంక్ సాధించారు.

అలాగే 400 పైగా మార్కులను 62 మంది విద్యార్థులు సాధించి, కళాశాల అత్యుత్తమ ఫలితాలు సాధించడంలో కీలకపాత్ర వహించారు. అలాగే మాల్ మండలం గోడుకొండ్ల గ్రామానికి చెందిన అనూష ఇంటర్ ఒకేషనల్ ఎమ్‌ఎల్టి గ్రూప్ మొదటి సంవత్సరంలో 500 మార్కులకు 489 మార్కులతో స్టేట్ 1వ ర్యాంక్ సాధించి చరిత్ర సృష్టించిందన్నారు. అలాగే ఒకేషనల్ గ్రూప్ లో సుమారు 400 పైన మార్కులు 162 మంది విద్యార్థులు సాధించారనీ తెలిపారు.

ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో కందుకూరు మండలం బేగంపేట్ గ్రామానికి చెందిన మణికంఠ సిఈసి గ్రూప్ లో 1000 మార్కులకు 967 మార్కులతో 1వ స్థానంలో నిలువగా, ఇబ్రహీంపట్నంకు చెందిన సత్య ప్రసన్న  (ఎం.పీ.హెచ్.డ బ్ల్యూ) 1000 మార్కులకు 950 మార్కులతో 2వ స్థానంలో, శ్రీజ 946 మార్కులతో 3వ స్థానాన్నీ సాధించిందన్నారు. దింతో వాసవి కళాశాలలో ఒక్కసారిగా పండగ వాతావరణం నెలకొందని అన్నారు. అనంతరం స్వీట్స్ పంచి, బాణాసంచాలతో సంబరాలు అంబరాన్నంటాయి. 

ఉత్తమ ఫలితాలు అభినందనీయం : కళాశాల చైర్మన్ మాదారం రమేష్ గౌడ్

తమ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. చదువును కష్టంతో కాకుండా ఇష్టంతో చదవి ఉన్నత శిఖరాలను చేరాలని, అదేవిధంగా చదివిన పాఠశాలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు గొప్ప పేరుప్రతిష్టలు తెచ్చే దిశగా, ప్రతి విద్యార్థి ఎదగాలని ఆకాంక్షించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు తమను తాము కొత్తగా ఆవిష్కరించుకోవాలని సూచించారు.