క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు రవిచంద్రన్
కరీంనగర్: వాసవి వాగ్దేవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ పర్యటనను పురస్కరించుకొని స్థానిక ధనగర్ వాడి ప్రాథమిక పాఠశాలలో, పాఠశాల కోసం ఎలక్ట్రికల్ బెల్, పిల్లలకు నోటు పుస్తకాలు, పెన్నులు, మరియు వాటర్ ట్యాంక్ ప్రధానం చేయడం జరిగింది. అలాగే మున్సిపల్ కార్మికులకు చీరలు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఆర్ రవిచంద్రన్ మాట్లాడుతూ వాసవి క్లబ్ సేవా కార్యక్రమాలలో ఎప్పుడు ముందుంటుందని పేర్కొన్నారు. సమాజ సేవలో వాసవి క్లబ్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. వాగ్దేవి క్లబ్ అధ్యక్షురాలు మాడిశెట్టి ఉమాదేవి, కార్యదర్శి ఎం స్వరూప, గవర్నర్ జంధ్యం మాధవి, క్యాబినెట్ సెక్రటరీ జంధ్యం మధుకర్, ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆవునూరి శివలీల, రీజన్ చైర్మన్ నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు స్వీట్స్, స్నాక్స్ పంపిణీ చేశారు.