calender_icon.png 15 March, 2025 | 6:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రిలో రామయ్యకు వైభవంగా వసంతోత్సవం, డోలోత్సవం

15-03-2025 12:16:00 AM

భద్రాచలం, మార్చి 14 (విజయ క్రాంతి); భద్రాద్రి రామయ్యకు హొలీ పౌర్ణమిని పురస్కరించుకుని డోలోత్సవం, వసంతోత్సవం కార్యక్రమాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అర్చకులు. మార్చి 30 నుండి శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా, ఏప్రిల్ 6వ తేదీ సీతారాముల కల్యాణం, ఏప్రిల్ 7 న శ్రీరామ పట్టాభిషేకం జరగనున్నాయి.

అయితే హొలీ పౌర్ణమి పురస్కరించుకుని శ్రీసీతారామచంద్ర స్వామివారిని సుందరంగా అలంకరించిన ఊయలలో ఆశీనులను చేసి,వేద మంత్రోచ్చారణల మధ్య,ఆస్థాన సంగీత విద్వాంసుల జోలపాటల నడుమ, డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహించారు. వసంతోత్సవం జరిగిన రోజు రామయ్యను పెళ్ళికొడుకును చేసినట్లుగా ఇక్కడ భక్తులు భావిస్తారు.

ఎప్రిల్ 6 వ తేదీన జరిగే శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ పనులకు శాస్త్రోక్తంగా అధికారికంగా పనులు ప్రారంభించారు. ఉదయం పసుపుకొమ్ములు దంచిన మహిళలు అనంతరం తలంబ్రాలను కలిపారు.హొలీ పౌర్ణమి సందర్భంగా సహస్రధారణ,ప్రత్యేక స్నపనం నిర్వహించారు సుందరంగా అలంకరించిన స్వామివారిని ఉయాలలో ఆశీనులు చేసి డోలోత్సవం నిర్వహించారు అర్చకస్వాములు నక్షత్ర, కుంభహారతిలు స్వామివారికి సమర్పించారు. అనంతరం బేడా మండపంలో ఉత్సవమూర్తులకు వసంతాలను శాస్త్రోక్తంగా చల్లి ప్రత్యేకపూజలు నిర్వహించారు. భక్తులు ఒకరిపై ఒకరు వసంతాలను చల్లుకున్నారు రామనామస్మరణతో ఆలయం మారుమ్రోగింది.