calender_icon.png 1 January, 2025 | 10:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యోగా గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన వసంత లక్ష్మి

29-12-2024 11:12:08 PM

శిక్షణ ఇచ్చిన యోగ రామచందర్...

నిజామాబాద్ (విజయక్రాంతి): నగరంలోని దయానంద యోగ కేంద్రంలో శిక్షణ పొందిన వసంత లక్ష్మి గిన్నిస్ బుక్ రికార్డును సాధించినట్టు ఆ సంస్థ నిర్వాహకులు యోగ రామచందర్ తెలిపారు. సమకోనసనంలో గతంలో 3:22 నిమిషాల గిన్నిస్ బుక్ రికార్డు ఉండగా ఆ రికార్డును అధిగమించి 3:48 మూడు గంటల 48 నిమిషాల ఆసనం స్థితిలో ఉండి వసంత లక్ష్మి గిన్నిస్ బుక్ రికార్డు సాధించారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ గారు వసంతలక్ష్మిని అభినందించారు. నిజామాబాద్ జిల్లాలోని బోర్డ్ ఆఫ్ టెక్నికల్ లో శిక్షణ పొందుతూ జిల్లా రాష్ట్రస్థాయి జాతీయ స్థాయితో పాటు అంతర్జాతీయ స్థాయికి అనంతలక్ష్మి ఎదిగి నిజామాబాద్ యోగా గురువు దయానంద కేంద్ర యోగనిర్వకులు యోగా రామచంద్ర వద్ద ఆమె శిక్షణ పొందారు. ప్రపంచ స్థాయికి ఎదిగిన ఆమె వసంత అకాడమీ పేరుతో హైదరాబాద్ లో యోగా శిక్షణ సంస్థను ప్రారంభించి శిక్షణ ఇస్తున్నారు. తమ గురువు యోగ రామచందర్ శిక్షణ వల్లనే గిన్నిస్ బుక్ రికార్డు సాధించగలిగానని వసంత లక్ష్మి తెలిపారు. తన గురువు రామ్ చందర్ తో పాటు వసంతలక్ష్మి గవర్నర్ ను కలిశారు.