calender_icon.png 1 January, 2025 | 2:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యోగా గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన వసంత లక్ష్మి

29-12-2024 06:39:35 PM

శిక్షణ ఇచ్చిన యోగ రామచందర్ 

నిజామాబాద్,(విజయక్రాంతి): నగరంలోని దయానంద యోగ కేంద్రం(Dayananda Yoga Center)లో శిక్షణ పొందిన వసంత లక్ష్మి గిన్నిస్ బుక్ రికార్డు(Guinness Book Record)ను సాధించారు. ఈ విషయాన్ని ఆ సంస్థ నిర్వాహకులు యోగ రామచందర్ తెలిపారు. సమకోనసనంలో గతంలో 3:22 నిమిషాల గిన్నిస్ బుక్ రికార్డు ఉండగా ఆ రికార్డును అధిగమించి 3:48 నిమిషాల ఆసనం స్థితిలో ఉండి వసంత లక్ష్మి(Vasantha Lakshmi) గిన్నిస్ బుక్ రికార్డు సాధించారని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Telangana Governor Jishnu Dev Varma) వసంతలక్ష్మిని అభినందించారు.

నిజామాబాద్(Nizamabad) జిల్లాలోని బోర్డ్ ఆఫ్ టెక్నికల్ లో శిక్షణ పొందుతూ జిల్లా రాష్ట్రస్థాయి జాతీయ స్థాయితో పాటు అంతర్జాతీయ స్థాయికి అనంత లక్ష్మి ఎదిగిన నిజామాబాద్ యోగా గురువు దయానంద కేంద్ర యోగా నిర్వకులు యోగా రామచంద్ర(Yoga Ramachandra) వద్ద ఆమె శిక్షణ పొందారు. ప్రపంచ స్థాయికి ఎదిగిన వసంత లక్ష్మి హైదరాబాద్ లో వసంత అకాడమీ పేరుతో యోగా శిక్షణ సంస్థను ప్రారంభించారు. తమ గురువు యోగ రామచందర్ శిక్షణ వల్లనే గిన్నిస్ బుక్ రికార్డు సాధించగలిగానని చెప్పిన వసంత లక్ష్మి, గురువు రామ్ చందర్ తో పాటు కలిసి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు.