calender_icon.png 3 February, 2025 | 8:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథనిలో ఘనంగా వసంత పంచమి వేడుకలు

03-02-2025 05:36:59 PM

మంథనిలో ఘనంగా వసంత పంచమి వేడుకలు..

చదువుల తల్లి ఆలయంలో అక్షరాభ్యాసం..

గోదావరి నది తీరంలోని శ్రీ బాల సరస్వతి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు..

మంథని (విజయక్రాంతి): చదువుల తల్లిగా పిలువబడే శ్రీ సరస్వతి దేవి ఆవిర్భావ దినోత్సవం పుట్టినరోజును పురస్కరించుకొని సోమవారం మంథని గోదావరి నది తీరంలో గల శ్రీ బాల సరస్వతి ఆలయంలోని అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.  అమ్మవారికి మామిడి పువ్వులు సమర్పించుకుంటే అమ్మవారి కృపా కటాక్షాలు సిద్ధిస్తాయని శాస్త్రాలలో చెప్పబడింది. చదువుల తల్లి పుట్టిన రోజు సందర్భంగా వందలాదిమంది భక్తులు తమ పిల్లలకు ఆలయంలో అక్షరాభ్యాసం తొలి పలుకులు రాయించారు. శ్రీ సరస్వతి దేవి అంటే అందరికీ ఇష్ట దైవం. నా వసంత ఋతువు ప్రారంభమవుతుంది. అలాగే ఈ తొమ్మిది రోజులు వసంత నవరాత్రులు జరుపుకుంటారు.

ప్రకృతి స్వరూపిణి అయిన శ్రీ సరస్వతీ మాతను పూజిస్తే జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని భక్తుల్లో ప్రగాఢ విశ్వాసం. సరస్వతి దేవి మనం చేసే మంచి పనులకు సంతృప్తి చెంది విద్యనిస్తుంది. సంవత్సర కాలంలో మూడు అత్యంత విశిష్టమైన తిథులకు అత్యంత ప్రాధాన్యత నెలకొంది. వాటిలో వసంత పంచమి, అక్షయ తృతీయ, ధన త్రయోదశి ఎంతో ప్రాధాన్యత కలిగినది. వసంత పంచమి రోజున రాజ శ్యామల యాగం చేస్తే అంతా మంచి జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడింది. సమస్త సృష్టిలో జ్ఞానాన్ని ప్రసాదించే శ్రీ సరస్వతి అమ్మవారిని మాతంగి మాతగా కూడా పిలుస్తారు. మాతంగ మహాముని పుత్రిక అయిన సరస్వతి మాత కృపాకటాక్షం సిద్ధించాలంటే శ్రీ సరస్వతీ మాత ఆలయంలో అమ్మవారికి మామిడి పూత సమర్పిస్తే ఆమె ఎంతో సంతృప్తి చెందుతుందని పురాణాల్లో చెప్పబడింది.