calender_icon.png 19 January, 2025 | 9:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వసంత పంచమి ఉత్సవ పత్రికలు ఆవిష్కరణ

18-01-2025 07:49:04 PM

భైంసా,(విజయక్రాంతి): వచ్చే నెల ఫిబ్రవరి 1 నుంచి 3వ తేదీ వరకు బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడులకు హాజరుకావాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఆలయ ఈఓ నవీన్ కుమార్ శనివారం మంత్రి కార్యాలయంలో ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆమె ఉత్సవ ఆహ్వాన, ప్రచార పత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సహాయ ఈఓ సుదర్శన్, వేద పండితులు ఉన్నారు.