* వర్గల్ విద్యా సరస్వతి ప్రత్యేక పూజలు నిర్వహించనున్న
* పుష్పగిరి, గురు మదనానంద పీఠాధిపతులు
* నేటి ఉత్సవాలకు 50వేల మందికి పైగా హాజరుకానున్న భక్తులు
గజ్వేల్, ఫిబ్రవరి 2 : చదువుల తల్లి, కోరిన వరాలు ఇచ్చే వర్గల్ విద్యా సరస్వతి క్షేత్రం వసంత పంచమి వేడుకల శోభన సంతరించుకున్నది. వసంత పంచమి పర్వదినం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడానికి, దర్శనానికి వచ్చే భక్తులకు ఇలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ అనే ఏర్పాట్లు సిద్ధం చేసింది.
భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో క్యూలైన్ల ఏర్పాటుకు భారీ కేడ్లను అమర్చారు. గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి ఆలయ ప్రాంతాన్ని పరిశీలించి భద్రత చర్యలో భాగంగా ఆలయం చుట్టూ సీసీ కెమెరాలతో గట్టి నిఘా ఏర్పాటు చేశారు.
గత ఏడాది వసంత పంచమికి 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని చిన్నారులకు అక్షరాభ్యాసాలు నిర్వహించారని, గత ఏడాది కన్నా ఈసారి మరింత ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున సరిపడే విధంగా ఏర్పాటు చేసినట్లు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు 56 చంద్రశేఖర శర్మ సిద్ధాంతి తెలిపారు. మెదక్ ఉమ్మడి జిల్లాతో పాటు హైదరాబాద్,రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, నల్గొండ, వరంగల్ తదితర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వర్గల్ విద్యా సరస్వతి దర్శనానికి తరలి రానున్నారు.