బెల్లంపల్లి (విజయక్రాంతి): నాగశుద్ధ పంచమిని పురస్కరించుకొని సోమవారం నిర్వహించనున్న వసంత పంచమి వేడుకలకు బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు పాఠశాల ప్రధానాచార్యులు ఇంగు భాగ్యలక్ష్మి తెలిపారు. సోమవారం ఉదయం 9 పాఠశాల ప్రాంగణంలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ఉదయం పూజ, సంకల్పము, అగ్ని ప్రతిష్టాపన, సరస్వతి మంత్ర ప్రయుక్త ఏకాదశి గాయత్రి యజ్ఞం, కొన్ని ఇంపార్టెంట్ పెట్టాను పూర్ణాహుతి, శ్రీ సరస్వతి అష్టోత్తరం, అక్షరాభ్యాసం, ప్రవచనం, శాంతి మంత్రం నిర్వహించనున్నట్లు ఆమె చెప్పారు. ఇతర వివరాలకు 9959194220, 9121633519 నెంబర్లను సంప్రదించాలని ఆమె కోరారు.