05-03-2025 08:56:21 PM
ఆందోల్: ఆందోల్ జోగిపేట పురపాలక సంఘము పరిధిలోని వరుణ్ మోటార్స్ 2024-25 సంవత్సరానికి సంబందించిన వృత్తి వ్యాపార లైసెన్స్ తీసుకొని వరుణ్ మోటార్స్ షోరూమ్ను సీజ్ చేశారు. లైసెన్సు వెంటనే తీసుకోవాలని గతంలో తీసుకున్న వృత్తి వ్యాపార లైసెన్స్ రెన్యువల్ చేసుకొనుటకు గడువు ముగిస్తున్నందున వెంటనే మీయొక్క షాపు లైసెన్సు రెన్యువల్ చేసుకొని అపరాధ రుసుము పడకుండా జాగ్రత్త పడగలరని సూచించారు. పురపాలక సంఘము యొక్క టాస్క్ ఫోర్సు టీం వృతి వ్యాపార లైసెన్సులపై ఆకస్మిక తనిఖీలలో మీ యొక్క లైసెన్సు లేనియెడల మీపై పురపాలక చట్టము-2019 ప్రకారం చర్యతీసుకోనబడును భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఇట్టి కార్యక్రమములో సానిటరీ ఇన్స్పెక్టర్ వినయ్, సీనియర్ అసిస్టెంట్ బి.శ్రీధర్, జూనియర్ అసిస్టెంట్ ఖయముద్దిన్, జవాన్ రాజశేఖర్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.