calender_icon.png 16 January, 2025 | 9:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరుణుడి అంతరాయం ఆఫ్గన్, కివీస్ ఏకైక టెస్టు

12-09-2024 12:48:09 AM

నోయిడా: నోయిడా వేదికగా అఫ్గానిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ మూడో రోజు కూడా రద్దయింది. అయితే తొలి రెండు రోజులు ఔట్ ఫీల్డ్ చిత్తడిగా ఉందన్న కారణంతో రద్దు కాగా.. మూడో రోజు మాత్రం వరుణుడు అడ్డంకిగా మారాడు. ఉదయం నుంచి విరామం లేకుండా కురిసిన వర్షం మధ్యాహ్నానికి కాస్త తెరిపినిచ్చినప్పటికీ మ్యాచ్ జరిగేందుకు వీలు లేకపోవడంతో అంపైర్లు మూడో రోజు ఆటను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే మూడు రోజులు  తుడిచిపెట్టుకుపోవడంతో ఫలితం వచ్చే అవకాశమైతే లేదు. అయితే రెండు రోజుల పాటు 98 ఓవర్ల ఆట మాత్రం నిర్వహించే అవకాశముంది.