న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ వరుణ్ ఆరోన్ శుక్రవారం దేశవాలీ సహా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన 35 ఏళ్ల వరుణ్ తాజాగా దేశవాలీ క్రికెట్‌కు కూడా గుడ్ బై చెప్పాడు. 2011లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన వరుణ్ ఆరోన్ టీమిండియా తరఫున 9 టెస్టుల్లో 18 వికెట్లు, 9 వన్డేల్లో 11 వికెట్లు పడగొట్టాడు.
విజయ్ హజారే ట్రోఫీలో జార్ఖండ్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న వరుణ్ ఆ జట్టు నాకౌట్‌కు చేరడంలో విఫలం కావడంతో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. దేశవాలీ క్రికెట్‌లో 88 లిస్ట్ మ్యాచ్‌ల్లో 141 వికెట్లు, 95 టీ20ల్లో 93 వికెట్లు పడగొట్టాడు. 2022లో ఐపీఎల్ టైటిల్ నెగ్గిన గుజరాత్ జెయింట్స్ సభ్యుడైన వరుణ్ ఆరోన్ 52 మ్యాచ్‌ల్లో 44 వికెట్లు తీశాడు.