ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల
కరీంనగర్ సిటీ, నవంబరు 24 (విజయక్రాంతి): కరీంనగర్ టవర్‌సర్కిల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వర్ష జువెల్లర్స్‌ను ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభించారు. వినియోగదారులకు అనుగుణంగా మన్నికగల ఆభరణాలు ఏర్పాటు చేశామని యజమానులు ఎలగందుల వీరేశం, పెద్ది వేణుగోపాల్, బొడ్ల రాజు మంత్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్, జగిత్యాల ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.