calender_icon.png 18 March, 2025 | 10:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు

18-03-2025 06:12:49 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల్ల రామకృష్ణ పర్యటనలో భాగంగా బెల్లంపల్లి వాసవి క్లబ్ సభ్యులు దత్తాత్రేయ ట్రేడర్స్ యజమాని శ్రీనివాస్ సహకారంతో శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు విద్యార్థుల దాహార్తిని తీర్చేందుకు వాటర్ ట్యాంకును బహుమతిగా అందజేశారు. నిరుపేద మహిళకు కుట్టుమిషన్ ను పాత భాస్కర్ కుమారుడు పాత నవీన్ కుమార్ ఆర్థిక సహకారంతో అందజేశారు. పాఠశాల విద్యార్థులకు  బ్యాగులు, కంపాక్షులు అందించారు.

ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులకు డైరీలు, పెన్నులను అందజేశారు. అమ్మ అనాధాశ్రమానికి రెండు సీలింగ్ ఫ్యాన్లను దాతల సహకారంతో అందజేశారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల్ల రామకృష్ణ, గవర్నర్ ఇల్లందుల కిషోర్, అంతర్జాతీయ ఆఫీసర్లు శ్రీనివాస్, బాల సంతోష్, జిల్లా సెక్రెటరీ సర్వీస్ కొంకుముట్టి వెంకటేష్, జిల్లా వైస్ గవర్నర్ బాలమోహన్, జిల్లా కోశాధికారి వేణుగోపాల్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ విద్యాసాగర్, పెద్ది రాజేందర్, క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ కొడిప్యాక శ్రీనివాస్, మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు పాత భాస్కర్, క్లబ్ అధ్యక్షులు సామా మహేష్, సెక్రటరీ అవునూరు సాయి, ట్రెజరర్ తాటి పెళ్లి సాగర్ లు పాల్గొన్నారు.