06-03-2025 12:28:09 AM
హైదరాబాద్, మార్చి 5 (విజయక్రాంతి): రాష్ట్రపతి భవన్‌లోని అమృత్ ఉద్యాన్‌లో బుధవారం “వివిధతా కా అమృత్ ఉత్సవ్” ప్రారంభోత్సవంలో తెలంగాణ ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. రాష్ర్ట ప్రభుత్వం తరఫున గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
తెలంగాణ స్టాళ్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించారు. అగ్గిపెట్టెలో పట్టే విధంగా చేతితో చీర నేసిన సిరిసిల్ల నేతకారులను రాష్ర్టపతి ప్రముఖంగా ప్రశంసించారు. ప్రధాన కార్యక్రమం అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ప్రదర్శించిన “గుస్సాడి” నృత్యం చూపరులను ఆకట్టుకుంటుంది.